సంబంధిత వార్తలు
- టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో
- KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు
- Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?
- విద్యుత్ ట్రాన్స్మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు
స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం
'స్వచ్ఛ గోదావరి- పవిత్ర పుష్కరాల' నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత గోదావరి, పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మురుగు నీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంజూరు చేసిన రూ.100 కోట్ల నుంచి కూడా నిధుల వినియోగించాలని ఆదేశించారు. రోజువారీ 104 మిలియన్ లీటర్ల మురుగునీరు జీవనదిని కలుషితం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు గోదావరిలో కలుస్తోందని పేర్కొన్నారు.
పారిశ్రామిక వ్యర్థాల్లో ఆంధ్ర పేపర్ మిల్లు వెదజల్లే రోజువారీ కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందన్నారు. నిత్యం గోదావరిలో కలిసే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమన్నారు. పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్‌కి కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
