1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 21-12-2025 Daily Astrology

21-12-2025 ఆదివారం ఫలితాలు - దంపతుల మధ్య చిన్న కలహం...

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య చిన్న కలహం. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ సహనానికి పరీక్షా సమయం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. పరిచయస్తుల ఆహ్వానం అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యానుకూలత ఉంది. రుణసమస్య కొలిక్కివస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. దైవదీక్ష స్వీకరిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూల ఫలితాలున్నాయి. సంతోషకరమైన వార్త వింటారు. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. పిల్లలకు శుభం జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. మనోధైర్యం పెంపొందుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. పొదుపునకు ఆస్కారం లేదు. చేపట్టిన పనులు సాగవు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. మానసికంగా కుదుటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. మనోభీష్టం నెరవేరుతుంది. పరిచయాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఏ కార్యం తలపెట్టిన విజయవంతమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు జాగ్రత్త. గృహనిర్మాణం ముగింపునకు వస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కలిసివచ్చే సమయం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకకు హాజరవుతారు. బెట్టింలకు పాల్పడవద్దు. 
About Writer
రామన్
తర్వాతి కథనం
21-12-2025 నుంచి 27-12-2025 వరకు మీ వార రాశిఫలాలు