బుధవారం, 24 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2025 (12:34 IST)

21-12-2025 నుంచి 27-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి ఏమంత అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేయండి. సంప్రదింపులు నిరుత్సాపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పందాలు, జూదాల జోలికిపోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. సమర్ధకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ధనం మితంగా ఖర్చు చేయండి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో మితంగా మాట్లాడండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. పరిస్థితులు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి విముక్తులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆదివారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమతాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసపరుస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్పటిమతో రాణిస్తారు. ఇతరుల మంచి కోరి చేసిన వాక్కు ఫలిస్తుంది. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక సంఘటన పట్టుదల రేకెత్తిస్తుంది. మొండిగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దలు ఆశీస్సులందిస్తారు. ఆదాయం కొంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సలహాలు, సాయం ఆశించవలద్దు. స్వయంశక్తితోనే అనుకున్నది సాధిస్తారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడననట్టు వదిలేయండి. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కనపించకుండా పోయిన పత్రాలు సంపాదిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. బాధ్యతల నుంచి విముక్తి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పందాలు, జూదాల జోలికిప్వోద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అవసరాలు నెరవేరుతాయి. కొత్తపనులు చేపడతారు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. సోమవారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎదుటివారి సామర్థ్యాన్ని తక్కువ అంచరా వేయొద్దు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అజ్ఞాత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. సాఫ్ట్వేర్ విద్యార్థులకు విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కార్యసాధనకు మరింత శ్రమించాలి. తలచినది ఒకటైతే మరొకటి జరుగుతుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. గురువారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. ఆరోగ్యం మందగిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు సానుకూలమవుతాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. గృహమార్పు అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రింటింగ్ రంగా వారికి ఆదాయాభివృద్ధి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు మొదలెడతారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. సొంత నిర్ణయం తగదు. వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలొస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తుంటారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారిస్తుంది. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మంగళవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానానికి మంచి ఫలితాలున్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూల సమయం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం ఆశాజనకం. లక్ష్యం సాధించే వరకు శ్రమిస్తారు. యత్నాలకు పరిస్థితులకు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును స్వయంగా తెలుసుకోండి. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలపై ఆధారనపడవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వృత్తి ఉద్యోగ విధులపై శ్రద్ద వహించండి. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటె సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.