మంగళవారం, 20 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2025 (08:39 IST)

మంగళవారాల్లో హనుమకు లడ్డూ, అరటి పండ్లు సమర్పిస్తే?

Hanuma
Hanuma
మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా బలం, ధైర్యం పెరుగుతుంది. ఈ రోజున భక్తులు హనుమాన్ చాలీసాను జపిస్తూ ఎర్రటి పువ్వులు, సింధూరం, స్వీట్లు సమర్పిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 
ఈ ఉపవాస వ్రతం ద్వారా జీవితంలో అడ్డంకులను తొలగిపోతాయని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని.. ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని విశ్వసిస్తారు. మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల జాతకంలో కుజుదోషాలు తొలగిపోతాయి. ఇంకా జీవితంలో శాంతి, విజయాన్ని పొందుతారని విశ్వాసం. 
 
ఆవు నెయ్యితో దీపం వెలిగించి, సింధూరం, తమలపాకుల మాల, ఎర్రటి పువ్వులు లేదా ఎర్రటి పూల దండ, ఎర్రటి కొత్త వస్త్రాన్ని హనుమంతునికి ఆలయాల్లో సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే లడ్డూలను, అరటిపండ్లను ప్రసాదంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.  
 
ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాత హనుమంతుడిని పూజించి, మంగళవార వ్రత కథను చదివి పూజను ప్రారంభించాలి. హనుమంతుడు శ్రీరాముని గొప్ప భక్తుడు. అందుచేత శ్రీరాముడిని ప్రార్థించడం లేదా రామాయణంలోని సుందరకాండ అధ్యాయాన్ని చదవడం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దివ్య ఆశీస్సులను పొందడానికి సులభమైన మార్గం.
 
పూజ చివరిలో పువ్వులు సమర్పించి, హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ పూజ పూర్తయిన తర్వాత, ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. రోజంతా ఉపవాసం వుండటం చేయవచ్చు. సాధ్యం కాకపోతే, గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారంతో పాటు ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
 
 
ఈ రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, అవసరమైన వారికి దుస్తులు దానం చేయడం ద్వారా ఈతిబాధలు, శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇలా వరుసగా 21 మంగళవారాలు పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.