సంబంధిత వార్తలు
- 25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...
- 24-12-20 బుధవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలంగా లేదు
- డిశెంబరు 23 మీ రాశి ఫలితాలు, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది
- 22-12-2025 సోమవారం రాశిఫలాలు - కీలక పత్రాలు అందుకుంటారు...
- 21-12-2025 ఆదివారం ఫలితాలు - దంపతుల మధ్య చిన్న కలహం...
26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. దీక్షతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సన్నిహితులతో సంభాషిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ధైర్యంగా అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. అపజయం మీలో పట్టుదలను రేకెత్తిస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒత్తిళ్లకు గురికావద్దు. దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యవహారంలో పెద్దల సలహా పాటించండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అభీష్టం నెరవేరుతుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రతను కోల్పోవద్దు. ఆచితూచి అడుగేయండి, పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పెద్దలకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. లక్ష్యానికి చేరువవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనవ్యయంలో మితం పాటించండి. బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని విధాలా అనుకూలం. మీ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంంతోషకరమైన వార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు, ఖర్చులు విపరీతం. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దూరప్రయాణం తలపెడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహిస్థితి బాగుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లావీదేవీలు కొలిక్కివస్తాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కార్యదీక్షతో లక్ష్మాన్ని సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనసహాయం తగదు. పనులు మధ్యలోనిలిపివేయొద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. అనవసర జోక్యం తగదు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యానుకూలత ఉంది. మంచి ఫలితం సాధిస్తారు. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది,
