సంబంధిత వార్తలు
- 01-01-2026 గురువారం ఫలితాలు - పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు...
- 31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...
- 30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...
- 29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...
- 28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...
02-01-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి అధికం.. కీలకపత్రాలు జాగ్రత్త...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పెద్దఖర్చు తగుల్తుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. కీలకపత్రాలు జాగ్రత్త. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మహిళలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సన్నిహితులను సంప్రదించండి. దుబారాఖర్చులు విపరీతం. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కీలక అంశాలపై దృష్టి పెడతారు. పనులు ఒక పట్టాన సాగవు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆడంబరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. బెట్టింగులకు పాల్పడవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. నోటీసులు అందుకుంటారు. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు.
