మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పందాలు, పోటీల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ముగ్గులపోటీల్లో మహిళలు రాణిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. పందాలు, పోటీల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులు కలిసిరావు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. అనవసర జోక్యం తగదు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. పనులు మందకొడిగా సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. దూరప్రయాణం తలపెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు.. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బంధుమిత్రులతో విభేదిస్తారు. పట్టింపులకు పోవద్దు. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ముగ్గుల పోటీల్లో మహిళలు విజయం సాధిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో మెలగండి. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. పనుల్లో శ్రమ అధికం. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కలిసివచ్చే సమయం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.