చంద్రోదయంతోనే చంద్రగ్రహణం, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు?
ఈ ఏడాది ప్రారంభంలో మొదటి చంద్రగ్రహణం ఈరోజు సాయంత్రం సంభవించనుంది. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse). ఇది ప్రధానంగా ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ ప్రాంతం, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలో కనిపిస్తుంది. మన దేశంలో పాక్షికంగా దర్శనమిస్తుంది. ఈ గ్రహణం సింహ రాశి, పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది.
గ్రహణం సింహ రాశిలో జరుగుతోంది కాబట్టి, ఆ రాశి వారు, కొన్ని ఇతర రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి వారికి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు లేదా అనవసర ఆందోళనలు ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిదానం అవసరం. మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భయం అవసరం లేదు, కానీ ఆధ్యాత్మిక సాధన అందరికీ మంచిది.
గ్రహణ సమయంలో చేయవలసిన పరిహారాలు
గ్రహణ ప్రభావం తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వుంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ లేదా మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత బియ్యం, పాలు, పెరుగు లేదా వెండి వస్తువులను(చంద్రునికి సంబంధించినవి) దానం చేయడం శుభప్రదం. గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లుకుని, స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఆహారం: గ్రహణ సమయంలో వండిన ఆహారంపై దర్భలు (గరిక) వేయడం మన సంప్రదాయం. దీనివల్ల ఆహారం కలుషితం కాదని నమ్మకం.
చేయకూడనివి
ముఖ్యమైన నిర్ణయాలు లేదా కొత్త పనులు ప్రారంభించవద్దు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిది.