1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Khammam and Bhogapuram accidents details

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ దంపతుల మృతి.. నారా లోకేష్ దిగ్భ్రాంతి

Accident
Accident
ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులు మరణించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
మృతులను హైదరాబాద్‌కు చెందిన కిషోర్ రెడ్డి, లావణ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
మరోవైపు విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుందరపేట సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు వ్య‌క్తుల్లో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు నారా లోకేష్ సానుభూతి వ్యక్తం చేశారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తమిళనాడులో ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తుల మృతి