మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయాల్సిన సమయం అనవసర జోక్యం తగదు. వివాహల్లో మీ ప్రమేయం లేకుండా జూగ్రత్త వహించండి. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు విపరీతం ఎడ్లపందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖలతో పరిచేయాలేర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. ఆస్తులను వేడుకను ఆహ్వానిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు జీతాలపై దృష్టి పెడతారు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒప్పందాలకు అనుకూలం. పెద్దల సలహా పాటిస్తారు. ధనలాభం. వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం. కొత్త ప్రయత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పనులు ఒక పట్టాన సాగపు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిపుణుల సలహా పాటించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భేషజాలకు పోవద్దు. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఓర్పుతో శ్రమించినా పనులు పూర్తి కావు. అప్రియమైన వార్త వింటాడు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగపు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనాన్ని రాబట్టుకోవాలి. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు ఎదుర్కుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. గౌరవప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ప్రణాళికలు చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురవుతుంది. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఇతరులను సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు, ఓర్పు, కృషి ప్రధానం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమించిన గాను పనులు పూర్తికావు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలతో సతమతమవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఏకాగ్రతతో వాహనం గడపండి.