గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Horoscope nakshatra
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నోటీసులు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణఒత్తిడితో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తులను సంప్రదిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్నివిధాలా అనుకూలం. ఒక సమస్య నుంచి బయటపడతారు. మొండి బాకీలు వసూలవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులను సంప్రదిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కొందరి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఆలోచలతో సతమతమవుతారు. దంపతుల మధ్య అకారణ కలహం.. పట్టుదలకు పోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. వాయిదా పడిన పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఎదుర్కుంటారు. కొత్తపరిచయాలేర్పడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. పరిచయస్తులే వ్యతిరేకులవుతారు. చేపట్టిన పనులు సాగవు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసిద్ధికి ఓర్పు ముఖ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. గత సంఘటనలు మరిచిపోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితులను సంప్రదిస్తారు.