గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 17 జనవరి 2026 (23:29 IST)

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న కార్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను నమ్మవద్దు. బుధవారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పనిభారం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది, ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. శుక్రవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్స్ సకాలంలో చేయిస్తారు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులకు తగిన సమయం. సంస్థల స్థాపనలు ఉమ్మడిగా కంటే సొంతంగా చేపట్టడమే శ్రేయస్కరం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు స్థానచలనం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలపై దృష్టిపెడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్నిరంగాల వారికీ యోగదాయకమే. అనుకున్న కార్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. బుధవారం నాడు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆప్తుల సాయంతో వివాదం సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. సంతానానికి శుభఫలితాలున్నాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణ. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సౌమ్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు జ్ఞప్తికిస్తాయి. గురువారం నాడు పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. తలపెట్టిన కార్యం సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శనివారం నాడు పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. అప్రమత్తంగా మెలగవలసిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో ఆశించిన మార్పువస్తుంది. సన్నిహితులతో తరుచుగా సంభాషిస్తుంటారు. ఒక విషయం ఆలోచింపచేస్తుంది. అయిన వారిని సలహా కోరుతారు. పెద్దల హితవు మీపై ప్రభావం చూపుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం సర్వదా అనుకూలం. స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు శ్రేయస్కరం కాదు. కొత్తపనులు చేపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తుల పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం, ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండివ. సలహాలు, సాయం కోరవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. గృహమార్పు అనివార్యం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదవకాశం లభిస్తుంది. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురువారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమిత పడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు బదిలీతో కూడిన పదోన్నతి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. పురస్కారాలు అందుకుంటారు. మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీ ఉన్నతి కొందరికి అసూయ కలిగిస్తుంది. విమర్శలు, చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. మంగళవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
కార్యసాధనకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. ఆశించిన అవకాశం చేజారిపోతుంది. మనోధైర్యంతో మరోసారి యత్నించండి. నేడు అనుకూలించనిది రేపు ఫలించవచ్చు. సహాయం, సలహాలు కోరవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. సోమవారం నాడు పనల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానానికి శుభయోగం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.