మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం. పట్టుదలకు పోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు సత్ ప్రభావం చూపుతాయి. ఖర్చులు విపరీతం. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. నగదు, పత్రాలు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులు అధికం. సంప్రదింపులకు తగి నమయం. లావాదేవీల్లో ఒత్తిడికి గురికావద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా కార్యక్రమాలు కొనసాగిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. బంధువులతో సంభాషిస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రయాణం చికాకుపరుస్తుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రతికూలతలకు కుంగిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్థతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. అప్రియమైన వార్త వింటారు. దూర ప్రయాణం తలపెడతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అధికం. బుధ, గురు వారాల్లో అందరితోను మితంగా సంభాషించండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం, రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధంపై నమ్మకం పెంచుకోండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. ముఖ్యులను కలుసుకుంటారు.