సంబంధిత వార్తలు
- 23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...
- 22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..
- 20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...
- 19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...
- 18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...
24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులకు సాయం చేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ప్రముఖులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోను కావద్దు. ధనసమస్యలెదురవుతాయి. ఆప్తులు సాయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం తగదు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పొదుపునకు ఆస్కారం లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ప్రయాణం తలపెడతారు.
