1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 26-01-2025 Daily Astrology

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

simha raashi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆటుపోట్లను అధిగమిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోను రాజీపడద్దు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పనులు మధ్యలో ఆపివేయొద్దు. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకలంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయం నిరాశాజనకం. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు సాగవు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను నిబ్బరంగా ఎదుర్కుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరం. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నేడు ఆశాజనకం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. మాట నిలబెట్టుకుంటారు. కొత్తయత్నాలు చేపడతారు. పనులు వేగవంతమవుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు ఒక పట్టాన సాగవు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. విందుకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అనాలోచిత నిర్ణయాలు తగదు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు.
About Writer
రామన్
తర్వాతి కథనం
27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...