శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

lovers
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు అందుకుంటారు. పనులు ఇతరులకు పురమాయించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభసమయం సమీపించింది. ధైర్యంగా ముందుకు సాగండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. యత్నాలను అయిన వారు ప్రోత్సాహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పొదువుపై దృష్టి పెడతారు. శుభకార్యానికి హాజరవుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్తపనులు చేపడతారు. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు ఆదాయానికి తగినట్లు ప్రణాళికలు చేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనాలోచితంగా వ్యవహరిస్తే నష్టపోతారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మీ కలుపుగోలుతనం అడట్టుకుంటుంది. ప్రముఖులు సన్నిహితులవుతారు. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది విలాసాలకు ఖర్చుచేస్తారు. వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్యులు సామాన్యం, బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది, వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ముఖ్యులతో చర్చలు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం ఆభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పనులు ముందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆప్తులను కలుసుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. లావాదేవిల్లో ఏకాగ్రత వహించండి. ఆవేశాలకు లోనుకావద్దు. అనాలోచిత నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తప్పటడుగు వేస్తారు. పనులు ఇతరులకు పురమాయించవద్దు. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.