బుధవారం, 15 ఏప్రియల్ 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్న కార్యం సఫలమవుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. ఆత్మీయుల వీలుపడదు. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. బెట్టింగ్ల జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. మొండిగా అడుగు ముందుకేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పెట్టుబడులు కలిసిరావు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోభీష్టం సిద్ధిస్తుంది. వాక్చాతుర్యంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రలోభాలకు గురికావద్దు. అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, వాయిదాల చెల్లింపులో జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి తక్షణమే ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పత్రాలు జాగ్రత్త. వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. శ్రమ ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు.