మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికీ అనుకూలదాయకమే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త, దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో నిర్లక్ష్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలుగచేస్తుంది. మీ ఇష్టాయిష్టాలను ఆత్మీయుల ద్వారా తెలియజేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. విశ్రాంతిలోపం, అకాల భోజనం. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఆప్తులతో తరచుగా సంభాషిస్తుంటారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతాడు. అవకాశాలను తక్షణం అందుకోండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సిరాస్థి ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనాదాయం, ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. సన్నిహితులను సంప్రదించండి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఔషధ సేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. ఆత్మీయులకు శుభ సమాచారం అందిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలను విరమించుకోవద్దు. ఓర్పు, పట్టుదలే మీ విజయానికి దోహదపడతాయి. ఆదాయం, బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయానున్న వెలితి వెంటాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. సోదర వర్గం వారితో విభేదాలు తలెత్తుతాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఈ మాసం ద్వితీయార్ధం కొంతమేరకు అనుకూలం. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి శుభఫలితాలు. మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. లక్ష్యానికి చేరువవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవారు. చిట్స్, ఫైనాన్స్ సంస్థల జోలికి పోవద్దు. ఏజెంట్లు ప్రలోభాలకు గురిచేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్తపనులు చేపడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నారు. వ్యవహారానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య కలహాలు, ప్రశాంతత భంగం. సంతానానికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శుభకార్యానికి హాజరవుతారు. మీ సాయంతో ఒకరికి పనులు సానుకూలం అవుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వాహనం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దూరపు బంధువులు సన్నిహితులు అవుతారు. గృహంలో ప్రశాంతత, సంతాన సౌఖ్యం పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. వివాహయత్నం ఫలిస్తుంది. కళ్యాణ వేదికలు అన్వేషిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా చేసుకుంటారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా శుభదాయకమే కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. గతంలో నిలిచిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆదాయానికి సరిగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఇతరులను విషయాలకు దూరంగా ఉంచండి. సంతానసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యూవల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందికి గురిచేస్తుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ సందర్శనలకు యత్నాలు సాగిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం, వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి ఆలోచనను క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానానికి శుభయోగం. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి శ్రీకారం చుడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. వేడుకకు హాజరవుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం కొంతమేరకు అనుకూలం. లావాదేవీలు కొలిక్కివస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పసులు ఎట్టకేలకు పూర్తికాగలవు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పరిచయస్తుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర విషయాలు జోలికి పోవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని విధాలా లాభదాయకమే. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఆలయానికి తగ్గట్లుగా బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం, ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దాంపత్యసౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. దూరపు బంధువులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు, పరిచయం లేని వారితో జాగ్రత్త, వ్యవహారాలే ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సంస్థల స్థాపనకు అనుకూలతలు మంజూరవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రథమార్ధం యోగదాయకం. లక్ష్యం నెరవేరుతుంది. శుభకార్యాన్ని ఆడంబరంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ద్వితీయార్ధంలో ఆచితూచి అడుగేయాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగరు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. గృహమార్పు కలిసివస్తుంది. సంతానానికి శుభయోగం. పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయండి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైనా రంగంలో అనుభవం గడిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు, అవివాహితులు శుభవార్త వింటారు. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త, పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.