09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహం కలిగిస్తుంది. వస్త్రప్రాప్తి. వాహన సౌఖ్యం ఉన్నాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పోగొట్టుకున్న పత్రాలు ఎట్టకేలకు సంపాదిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. అనవసర జోక్యం తగదు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. దంపతుల మధ్య అకారణ కలహం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. పెట్టుబడులు కలిసివస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమిస్తుంది. పనుల పట్ల అశ్రద్ధ తగదు. కార్యదీక్షతో శ్రమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం నెరవేరుతుంది. మాట నిలబెట్టుకుంటారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మొండిగా యత్నాలు కొనసాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒత్తిళ్లకు గురికావద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. చర్చల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. మీ ఏమరుపాటుతనం సమస్యాత్మకమవుతుంది. వాహనం ఇతరులకివ్వవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను సౌమ్యంగా తెలియజేయండి. పిల్లల అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసఫలీకృతకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. ఆశావహదృక్పథంతో మెలగండి. అవాంతరాలెదురైనా పనులు కొనసాగించండి. అవకాశం చేజారిపోతుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కలిసివచ్చే సమయం. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కీలక విషయాలు గోప్యంగా ఉంచండి. బెట్టింగులకు పాల్పడవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన సభలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి పట్టుదలతో శ్రమించాలి. సాయం ఆశించి భంగపడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. దూకుడుగా ప్రవర్తించవద్దు. మితంగా సంభాషించండి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో అప్రమత్తంగా ఉండాలి. నోటీసులు అందుకుంటారు.
