బుధవారం, 4 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్

04-03-2026 బుధవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం....

astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అప్రమత్తంగా ఉండాలి. భేషజాలకు పోవద్దు. ఆప్తులకు మీ సమస్య తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. కీలక చర్చలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభవార్త వింటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఆపన్నులకు సాయం చేస్తారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలందిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆహ్వానం అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంకల్పబలంతో యత్నాలు సాగించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు విపరీతం, చేతిలో ధనం నిలవదు. సన్నిహితులు ఆదుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య అకారణ కలహం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహానుకూలత ఉంది. కుటుంబసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్తపనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు సానుకూలమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లాభాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు లుంటాయి. పనులు పురమాయించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ధనలాభం ఉంది. రుణసమస్యలు తొలగుతాయి. బంధుమిత్రులతో సంభాషిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆచితూచి అడుగేయండి. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అదుపులో ఉండదు. కొందరి రాక అసహనం కలిగిస్తుంది. చేస్తున్న పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.