1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 08-03-2026 Your Daily Horoscope

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ రోజు యోగదాయకమే. వ్యవహార జయం ఉంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు అందరితోను, మితంగా సంభాషించండి. విలాసాలకు ఖర్చు చేస్తారు. చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి. మీ సాయంతో ఒకరు లబ్ది పొందుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ కృషికి అదృష్టం తోడవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. సంబంధం లేని విషయాలు. ఇతరుల జోలికి పోవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. చేపట్టిన పనులు త్వరితగతిన చురుకుగా సాగుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్తయత్నాలు చేపడతారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. విలాసాలకు ఖర్చుచేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మొదలెట్టిన పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఖర్చులు భారమనిపించవు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ధన సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఆటంకాలెదురైనా పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్తవారితో మితంగా సంభాషించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో శ్రమించండి. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఒప్పందాల్లో జాగ్రత్త. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి, పెద్దఖర్చు ఎదురవుతుంది. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ నేర్పునకు పరీక్షా సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఖర్చులు అందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ కష్టం వృధాకాదు. లక్ష్యానికి చేరువవుతారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. పొదుపుపై దృష్టి పెడతారు. చిట్స్, ఫైనాన్సుల జోలికి పోవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడిపండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అనుకోని సంఘటన ఎదురవుతుంది కొత్తయత్నం చేపడతారు. నోటీసులు అందుకుంటారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. లక్ష్యానికి చేరువవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వసులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దృఢసంకల్పంతో కార్యసిద్ధికి శ్రమించండి. మీ కష్టం వృధా కాదు. సంతోషకరమైన వార్త వింటారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆశలోదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ముఖ్యమైన వివరాలు గోప్యంగా ఉంచండి.
About Writer
రామన్
తర్వాతి కథనం
09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...