ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 7 మార్చి 2026 (17:09 IST)

07-03-2026 శనివారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు. పెద్దల సలహా పాటించండి. పత్రాలు అందుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా కలిసిస్తుంది. చిత్తశుద్ధిని చాటుకుంటారు. కొత్త పనులు చేపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ధనసహాయం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఏ పనీ చేయబద్ధి కాదు. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. బాధ్యతలు అప్పగించవద్దు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి గురవుతారు. ఓర్పుతో మెలగండి. ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పసిద్ధితో యత్నం సాగించండి. ఓర్పుతో శ్రమిస్తేనే కార్యం సాధ్యమవుతుంది. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. అప్రియమైన వార్త వింటారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆత్మీయులను కలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహబలం అనుకూలంగా ఉంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు పురమాయించవద్దు. వ్యవహారంలో జాగ్రత్త వహించండి. పత్రాలు సమయానికి కనిపించవు. వివాదాలు జటిలమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోభీష్టం నెరవేరుతుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఉత్సాహంగా శ్రమించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పొదుపు ధనం గ్రహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.