సంబంధిత వార్తలు
- తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?
- గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్
- తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న
- 2028లో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.. కేటీఆర్
- ఇంకెంత కాలం ఆంధ్రోళ్లు కారణం అంటారు, దేశంలో అంతా అలా అనుకుంటే?: పవన్ కల్యాణ్
తెలంగాణ సచివాలయంలో పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఊరుకోం : కేటీఆర్
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, కానీ తెలంగాణ సచివాలయంలోకి అడుగుపెట్టి పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ మంగళవారం హైదరాబాద్ నగర నడిబొడ్డున నిలబడి తెలంగాణ వేర్పాటువాదులకు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు. వీటిపై కేటీఆర్ బుధవారం స్పందించారు.
తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదన్నారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్ నగరంలో సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణకు వస్తున్న అనేక పరిశ్రమలను ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని, జాతీయవాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయ వాదాన్ని ఏమంటారని ఆయన ప్రశ్నించారు.
దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని కేటీఆర్ అన్నారు. అలాగే ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు. జనసేన కొత్తగా పోటీ చేసేదేముందని, 2018, 2023లో జనసేన తెలంగాణాలో పోటీ చేయలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామన్నారు. సోదరుడుగా ఇంటికొస్తే బిర్యానీ పెడతామని వ్యాఖ్యానించారు. సినీ నటుడుగా, కళాకారుడుగా అభిమానిస్తామన్నారు. కానీ, సచివాలయంలోకి వచ్చి పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
