1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. KCR will Take Oath As CM By Dec 2028: KTR

2028లో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.. కేటీఆర్

ktrbrs
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మంగళవారంనాడు పార్టీ కార్యాలయంలో తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు డిసెంబర్ 2028 నాటికి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కేటీఆర్ హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరులను చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన కృషిని, త్యాగాలను తెలంగాణ నాయకులు విస్మరించారని చెప్పారు. అమరుల రక్తస్థానంలో సాగునీరు ప్రవహించేలా కేసీఆర్ కృషి చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన యువతకు 1.65 లక్షల ఉద్యోగాలను కల్పించారు. 
 
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తన గురువుకు గురుదక్షిణగా సమర్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందుకు రేవంత్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 'రైతు బంధు' పథకాన్ని అందించడంలో అధికార పార్టీ విఫలమైందని పేర్కొన్న ఆయన, 'తెలంగాణ తల్లి' నడుము పట్టీని, కిరీటాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని ఆరోపించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
జూన్ 4వ తేదీ నాటికి కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు