1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Apoorva Comments On Casting Couch In Tollywood

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అపూర్వ కామెంట్లు... పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారంటే?

Actress Apoorva
Actress Apoorva
టాలీవుడ్ నటి అపూర్వ కాస్టింగ్ కౌచ్‌పై కామెంట్లు చేశారు. స్టార్ డమ్ వచ్చే వరకే ఎవరైనా ఇండస్ట్రీ వెంట పడతారు.. ఒక్క సారి స్టార్డమ్ వచ్చిన తరువాత ఇండస్ట్రీనే వారి వెంట పడుతుందని కామెంట్స్ చేశారు. కాస్టీంగ్ కౌచ్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు అయితే కమిట్ అవుతారని.. తెలుగు హీరోయిన్లు కమిట్ అవ్వరు అన్న మాట లేదు. అసలు ఎటువంటి కమిట్ మెంట్ లేకుండా స్టార్లుగా మారిన హీరోయిన్లను ఉన్నారని అపూర్వ చెప్పుకొచ్చారు. 
 
నిత్యామీనన్, భూమిక లాంటి వారు ఎంతో కష్టపడి టాలెంట్‌తో ఎదిగారు. అలాంటి వారిని చాలామందిని తాను చూశాను. వాళ్లకు పడిన ఫస్ట్ సినిమా హిట్ అవ్వడం వల్ల.. ఎవరు వారిని రూల్ చేసే పరిస్థితి రాకపోయి ఉండవచ్చు. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే.. హిట్ వచ్చే వరకూ మనం దాని చుట్టు తిరగాలి.. ఒక్కసారి హిట్ పడితే ఇండస్ట్రీనే మన చుట్టూ తిరుగుతుందని అపూర్వ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 
 
తాను కూడా 18 ఏళ్ల కెరీర్‌లో ఒకటి రెండు సార్లు తాను క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. "నీకో ఛాన్స్ కావాలంటే నాకో ఛాన్స్ ఇస్తావా" అని అడుగుతారు. పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారు. మహా అయితే ఆ సినిమా నుంచి తీసేస్తారు. స్టార్ అవ్వడం కాస్త లేట్ అవుతుంది అంతేనని అపూర్వ చెప్పారు. గతంలో చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్