1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Some people snore excessively when lying on their backs; what is the reason for this?

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?

snore reason
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు.
 
కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది. వెల్లకిలా పడుకుని నిద్రపోతున్నప్పుడు గురుత్వాకర్షణ వల్ల రిలాక్స్ అయిన నాలుక, గొంతు కండరాలు వెనక్కి... అంటే గాలి వెళ్లే శ్వాస మార్గం వైపుకు జారుతాయి. ఇలా కండరాలు వెనక్కి జారడం వల్ల గాలి ప్రయాణించే దారి చాలా ఇరుకుగా మారుతుంది.
 
శ్వాస తీసుకునేటప్పుడు, గాలి ఆ ఇరుకైన మార్గం ద్వారా ఒత్తిడితో వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న మెత్తటి కణజాలాలు ఒకదానికొకటి తగిలి కంపిస్తాయి. ఈ కంపనాల వల్ల వచ్చే శబ్దమే గురక. ఇలా వెల్లకిలా పడుకున్నప్పుడు గురక వచ్చేవారు అలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు. పక్కకు తిరిగినప్పుడు నాలుక, గొంతు కండరాలు శ్వాస మార్గానికి అడ్డంగా పడవు కాబట్టి గాలి ఫ్రీగా ఆడుతుంది.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి