ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను
Tapsee
అయితే, కాలక్రమేణా, పొట్ట కింది భాగంలో కొద్దిగా కొవ్వు ఉండటం పూర్తిగా సాధారణమైన, ఆరోగ్యకరమైన విషయం అని గమనించానని తెలిపింది. ఈ పోస్ట్ చాలా మంది మహిళలను కదిలించింది. తాను ఇప్పుడు తన సహజ శరీరాకృతిని అంగీకరించానని, ఇకపై అవాస్తవ ప్రమాణాల వెంట పడటం లేదని తాప్సీ చెప్పింది.
ప్రస్తుతం ముంబై- డెన్మార్క్‌ల మధ్య తాప్సీ తన సమయాన్ని గడుపుతోంది. ఆమె తన భర్త, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన మథియాస్ బోతో కలిసి డెన్మార్క్‌లో నివసిస్తోంది. ఆమె ఒకప్పుడు పలు తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఏ తెలుగు ప్రాజెక్టులకు సంతకం చేయలేదు.

