1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Secunderabad Railway Station on Track to Become World-Class Transit Hub

వరల్డ్ క్లాస్ ట్రాన్సిట్ హబ్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

Secunderabad Railway Station
Secunderabad Railway Station
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రమంగా ఒక ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్, రోజుకు దాదాపు 180 రైళ్లను నిర్వహించడంతో పాటు, సగటున రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 
 
ఈ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక పునరాభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 714.73 కోట్లు కాగా, ఇప్పటికే 64 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
పునరాభివృద్ధిలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు విశిష్టమైన కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, విశాలమైన ప్రవేశ ద్వారాలు, విస్తృతమైన వేచి ఉండే ప్రదేశాలు, సులభమైన ప్రయాణ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.
 
ప్రయాణికుల సౌకర్యార్థం రెండు స్థాయిల ఎయిర్ కాన్‌కోర్స్‌ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా ప్లాట్‌ఫామ్‌ల మధ్య ప్రయాణికుల రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధునాతన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 
 
స్టేషన్ పరిసరాలు, ప్లాట్‌ఫామ్‌లు, ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలు నిరంతర పర్యవేక్షణలో ఉండేలా భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణలో అధిక వర్షాలు - పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్