మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. పరస్పరం కానుకలిచ్చి పుచ్చుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధన సహాయం, ప్రైవేట్ ఫైనాన్స్ మదుపు తగదు. వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ నుంచి విషయం రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వృత్తి ఉద్యోగ బాధృతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాలు, సాఫ్ట్ వేర్ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశించిన కార్యం సిద్ధిస్తుంది. వాగ్ధాటి నెట్టుకొస్తారు. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ, వీలుపడదు. మొండిగా ముందుకు అడుగువేస్తారు. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతులు అభిప్రాయానికి రాగలుగుతారు. కావలసిన పత్రాలు కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే తరుణం. అవకాశాలు కలిసివస్తాయి. మీ మాటతీరు ఆరట్టుకుంటుంది. వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. స్థిరాస్తి ధనం జరుతుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. నేడు అనుకూలించని పరిస్థితులు రేపు చక్కబడతాయి. వచ్చిన అవకాశాన్ని తక్షణం అందుపుచ్చుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు పెద్దఖర్చు తగులుతుంది. సాయం చేసేందుకు పరిచయస్తులే వెనుకాడుతారు. అవసరాలకు ఏదో విధంగా ధనం సర్దుబాటవుతుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. నోటీసులు అందుకుంటారు. పెద్దలను సంప్రదిస్తారు. ప్రముఖుల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఏకాగ్రతతో వాహనం నడవండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వేరొకరికి కలిసిస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒత్తిడికి గురికావద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య కలహం, సౌమ్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దర్ చేసుకోనంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించకండి. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. సోమవారం వాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. పత్రాల రెన్యువల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తిపరంగా చికాకులెదుర్కుంటారు. ఉపాధ్యాయులకు చికాకులు అధికం. ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యానుకూలత ఉంది. ధైర్యంగా ముందుడగు వేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. మీ శ్రీమతి తీరులో మార్పువస్తుంది. అనురాగ వాత్సల్యాలు వెల్లి విరుస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు హోదామార్పు, స్థానచలనం, శుభకార్యానికి హాజరవుతారు. వివాదాలు పరిష్కారమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి వ్యవహార జయం ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ఖర్చుచేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆహ్వానం, ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. శుక్రవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం, అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. చిన్నవాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం. ఆలోచింపచేస్తుంది. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆదివారం నాడు కొత్త సమస్య ఎదురవుతుంది, పెద్దల గురించి ఆందోళన చెందునారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి, నూతన వ్యాపారాలకు అనుకూలం, ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించింది. నేటి కంటే రేపు శుభం అన్న భావంతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. సోమవారం నాడు చేసిన వసులే తిరిగి చేయవలసి వస్తుంది. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. సోదరవర్గం, బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. మీ శ్రీమతి చొరవతో మంచి జరుగుతుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. పలువురి హితవు మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు వుంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అందరితోను మితంగా సంభాషించండి. సంతానం పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ధనప్రలోభాలకు గురికావద్దు. అజ్ఞాత వ్యక్తుల పట్ల ఇబ్బందులెదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దస్త్రం వేడుక సజావుగా సాగుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. తగిన నిర్ణయం తీసుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాలు. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. పొగిడేవారి అంతర్యం గ్రహించండి. ఏ విషయాన్ని తేలికగా కొట్టివేయొద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త. శనివారం నాడు పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు అధికం ప్రయోజనకరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం, నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు, పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించకండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చిన్న వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు, ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి.