13-03-2026 శుక్రవారం ఫలితాలు - ఏ పని మొదలెట్టినా తిరిగి మొదటికే..?
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ఒప్పందాల్లో ఆచితూచి అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయం తగదు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణసమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సామాన్యం, సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. అనవసర జోక్యం తగదు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త, పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులతో తీరిక ఉండదు. కొత్త విషయం తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం, పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ముఖ్యల కలయిక వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. దంపతుల మధ్య ఆకారణ కలహం. ఆత్మీయులను కలుసుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. మధ్యవర్తిత్వాలు తగవు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
అందరితోను మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం, దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన పూర్తికావు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. వేడుకకు హాజరవుతారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఆపత్సమయంలో అయిన వారు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య ఆకారణ కలహం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. లావాదేవీలు ముందుకు సాగవు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ పని మొదలెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు కలిసినస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు, ఆహ్వానం అందుకుంటారు, పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ముఖ్యమైన లావాదేవీలు స్వయంగా చూసుకోండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధనలాభం, కార్యసిద్ధి ఉన్నాయి. మీపై సన్నిహితులు వ్యాఖ్యలు పనిచేస్తాయి. సమయస్పూర్తితో వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలకపత్రాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. నచ్చని సంఘటనలెదురవుతాయి. బంధువులతో విభేదాలు, దంపతుల మధ్య కలహం.
