14-03-2026 శనివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన పూర్తికావు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పనులు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం చికాకు కలిగిస్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్తయత్నాలు చేపడతారు. కార్యసాధకు మరింత శ్రమించాలి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు త్వరితగతిన సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు, దంపతుల మధ్య సఖ్యత లోపం. దైవకార్యంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమ అధికమైనా ఫలితం ఉంటుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. పరిచయస్తులు మీ సాయం కోరుతారు. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారిని సంప్రదిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పెద్దఖర్చు తగులుతుంది. పనులు ప్రారంభించే సరికి ఆటంకాలెదురవుతాయి. మొండిగా ముందుకు సాగుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. ఏ పని తలపెట్టినా మళ్లీ మొదటికే వస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొందరి వ్యాఖ్యులు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఏ పనీ ముందుకు సాగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ప్రియతములతో కాలక్షేపం చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. మొండిగా ముందుకు సాగుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవి దక్కదు. విలాసాలకు ఖర్చు చేస్తారు. పరిచయస్తులతో విభేదిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయ
తర్వాతి కథనం
