Astrology Weekly Horoscope Details

Notifications

మిథునం మిథునం
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కార్యసిద్ధికి నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్లే చేజారిపోతాయి, ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. బుధవారం నాడు పెద్దమొత్తంలో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, మీ పక్కనే మోసగాళ్లు ఉంటారని గమనించండి. శుభలేఖ అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారుల తీరుకు అనుగుణంగా మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.

అక్టోబర్ 10వ తేదీన 38 రైళ్లను రద్దు చేసిన రైల్వే

అక్టోబర్ 10వ తేదీన 38 రైళ్లను రద్దు చేసిన రైల్వేఇతర రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్ల నుండి బయలుదేరి, అక్టోబర్ 10వ తేదీన ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవలసిన సుమారు 38 రైళ్లను రద్దు చేసినట్లు, అయితే ఢిల్లీలోని ఇతర స్టేషన్లలో రైలు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర రైల్వే శుక్రవారం స్పష్టం చేసింది. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో తమ ప్రయాణాన్ని ముగించే మొత్తం 165 రైళ్లు ఉన్నాయి. అక్టోబర్ 10న ఈ స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన రోడ్డు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, వీటన్నింటిలో కేవలం 38 రైళ్లను మాత్రమే రద్దు చేశామని ఉత్తర రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?మహాలయ అమావాస్య వ్రతానికి వంట చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా దినుసులు వంటి వాటిని పూర్తిగా నివారించాలి. క్యాబేజీ, ముల్లంగి, ఆకుకూరలు వంటి కూరగాయలను అమావాస్య వంటలో కలపకూడదు. మహాలయ అమావాస్య రోజున, కోడిగుడ్డుతో సహా మాంసాహారం తినడం గానీ, మద్యం సేవించడం గానీ లేదా ధూమపానం చేయడం గానీ చాలా పెద్ద పితృ దోషాన్ని కలిగిస్తుంది. ఉదయం పూర్వీకులకు తర్పణం ఇచ్చి, కాకికి అన్నం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు భోజనం చేయాలి. అంతకు ముందు తినకూడదు. అమావాస్య రోజున ఉదయం వేళ గడపలో ముగ్గు వేయకూడదు. పసుపు కలిపిన నీటిని కూడా గడపలో చల్లకూడదు. ఉదయం పితృదేవతలకు తర్పణం ఇచ్చే వరకు పూజా గదిలో దీపం వెలిగించి పూజ చేయకూడదు.

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్నవరాత్రి అనేది దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే ముగ్గురు అమ్మవార్లను ఇంటికి ఆహ్వానించి, పూజించి, వారి అనుగ్రహాన్ని పొందే సమయం. అందువల్ల కలశం ఏర్పాటు చేసి, ఇంట్లో అమ్మవారిని కొలువుదీర్చే ముందు ఇంట్లో ఉన్న వాస్తు దోషం, ప్రతికూల శక్తులను తొలగించి, దైవ శక్తిని అడ్డుకునే వస్తువులను బయటకు పంపించాలని చెప్పబడుతుంది. నవరాత్రికి ముందు బయటకు తొలగించాల్సిన ఏడు వస్తువులు: విరిగిన విగ్రహాలు-విరిగిన, పగుళ్లు వచ్చిన లేదా రంగు వెలిసిపోయి పాడైన దేవుడి విగ్రహాలు, ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించగలవు. దీని వల్ల మానసిక ఒత్తిడి, గందరగోళాలు పెరుగుతాయి. అందువల్ల వీటిని గౌరవంగా ప్రవహించే నీటిలో తీసుకెళ్లి నిమజ్జనం చేయవచ్చు. లేదా తులసి మొక్క కింద పాతిపెట్టవచ్చు.