1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Dastagiri Intercepts YS Jagan's Convoy in Pulivendula

జగన్‌కు వెన్నులో వణుకు పుట్టించిన దస్తగరి.. కాన్వాయ్ అడ్డగించి నిలదీశాడు... (వీడియో)

dastagiri - jagan convoy
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన దస్తగరి ముచ్చెమటలు పోయించాడు. జగన్ కాన్వాయ్‌ను అడ్డుకుని... 'మా జీవితాలు నాశనం చేశావు' కదా బిగ్గరా కేకలు వేశారు. 
 
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో జగన్ ఆదివారం పులివెందులకు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఆ తర్వాత పోలింగ్ సరళని పరిశీలించి మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకోనున్నారు. అయితే, పులివెందులకు వచ్చిన జగన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పులివెందుల హెలిప్యాడ్‌ నుంచి నివాసానికి బయల్దేరిన ఆయన కాన్వాయ్‌కు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అడ్డుపడ్డాడు. 
 
ఈ విషయంపై కార్యకర్తలు జగన్‌కు సమాచారం ఇచ్చారు. మా జీవితాలను నాశనం చేశావంటూ జగన్‌ ఎదుటే దస్తగిరి వ్యాఖ్యానించాడు. జగన్‌ వైపు వెళ్తున్న అతడిని పోలీసులు అడ్డుకున్నారు. దస్తగిరి వాహనాన్ని డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఇతర పోలీసులు పక్కకు తీసి అతడిని పంపారు. దస్తగిరిని చూసీచూడనట్లు జగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పులివెందులలో అర్థరాత్రి వాహనాలకు నిప్పు - టెన్షన్ టెన్షన్