1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pulivendula miscreants create havoc before municipal election polling

పులివెందులలో అర్థరాత్రి వాహనాలకు నిప్పు - టెన్షన్ టెన్షన్

Pulivendula
ఏపీ పురపాలక ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి దాటి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి వద్ద నిలిపి వుంచిన వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో ఎనిమిది వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. 
 
పులివెందుల సమీపంలోని ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి వ్యాపారరీత్యా హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. పులివెందులలోని శిల్పారాం సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం ఒక ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడ 11 ద్విచక్రవాహనాలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్ ట్రాలీని నిలిపివుంచారు. 
 
శనివారం అర్థరాత్రి సమయంలో దుండగులు ఈ వాహనాలకు నిప్పుపెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే వాహనాలన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అల్లర్లు చోటుచేసుకోకుండా చూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దీపావళికి ముందు షాకిచ్చిన ఆయిల్ కంపెనీలు... గ్యాస్ ధర పెంపు