1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. West Godavari man attacks girlfriend with a knife in jangareddygudem

ప్రియురాలు దూరం పెట్టిందని చాకుతో పొడిసి చంపేసిన ప్రియుడు

knife
ప్రియురాలు తనను దూరం పెట్టిందని ఓ ప్రియుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న ప్రియురాలిని విచక్షణా రహితంగా చాకుతో పొడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జంగారెడ్డిగూడెం పట్టణం ఎస్సీ పేటలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు, పోలవరం మండలం తంగేడికొండకు చెందిన స్వప్న, అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నారు. స్వప్న కొద్ది రోజుల కిందట జంగారెడ్డిగూడెం వచ్చి ఆమె పెద్దమ్మ కుమార్తెతో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. 
 
స్వప్న తనను దూరంపెట్టిందనే అక్కసుతో శుక్రవారం ఇంట్లో ఉన్న ఆమెపై చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు దీంతో ఆమెను జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, స్వప్న చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. స్వప్న సోదరుడు కన్నంరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై వీరప్రసాద్‌ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నేడు ఢిల్లీలో ఇండియా కూటమి ఛలో ఢిల్లీ.. ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం