1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Municipal Elections Polling LIVE Updates

ఏపీ స్థానిక పోరు : విజయవాడలో గుర్తులు తారుమారు... ఓటేసిన ప్రముఖులు

election
ఏపీ మువిజయవాడ నగరంలోని 55వ డివిజన్‌లో బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్‌ రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైకాపా అభ్యర్థి షేక్‌ హసన్‌ బాషా పేరు ఎదురుగా హస్తం, కాంగ్రెస్‌ అభ్యర్థి షరీఫ్‌ షేక్‌ పేరు ఎదురుగా ఫ్యాన్‌ గుర్తు ముద్రించారు. బ్యాలెట్‌ పేపర్‌లో గుర్తులు మారడంపై వైకాపా అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో 55వ డివిజన్‌లో పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించిన అనంతరం సుమారు 2 గంటల తర్వాత పోలింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
 
మరోవైపు, ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 
 
గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఓటు వేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి వచ్చి ఓటు వేశారు. 
 
విజయవాడలో కూటమి మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధా, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు హక్కును  వినియోగించుకున్నారు. విశాఖపట్నంలోని ఎన్‌.టి.కాలేజ్‌ పోలింగ్‌ కేంద్రంలో కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రియురాలు దూరం పెట్టిందని చాకుతో పొడిసి చంపేసిన ప్రియుడు