1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Y S Jagan will contest from Pulivendula Assembly seat next assembly election

పులివెందుల అసెంబ్లీ సీటు జగన్‌కు లేనట్టేనా? నెటిజన్స్ ట్రోల్స్

Jagan
వచ్చే 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసేందుకు సీటు ఉంటుందా లేదా అన్నది ఇపుడు ప్రశ్నార్థంగా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాకముందు పార్టీ నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమై చేసిన వ్యాఖ్యలే ఇపుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. 
 
మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలేదు. అక్కడ ఇన్‌చార్జి.. తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడని గుర్తుపెట్టుకోండి.. అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇపుడే ఇదే ఆయనకు శాపమై కూర్చుంది. 
 
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడం ముగిసింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా, పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉండగా, అందులో సగం వార్డులకు వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దీంతో ఈ స్థానాలు అధికార పక్షానికి ఏకగ్రీవం కాన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులకు వైకాపా అధ్యక్షుడు జగన్ అల్టిమేటం వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా, ఈ వీడియోను జగన్‌‍కు ట్యాగ్ చేస్తూ, ఆయనపై సామాజిక మాధ్యమాల్లో అనేక సందేశాలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. పులివెందులలో 22 సీట్లు వదిలిపెట్టిన ఎమ్మెల్యే జగన్‌కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆయుధ పూజకు అతిథిగా వచ్చిన బారీ కొండ చిలువ (వీడియో)