పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద జగన్ నిరసన - రీపోలింగ్‌కు డిమాండ్ (Video)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే, కడప జిల్లా పులివెందులలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు జగన్ ఆదివారం పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ బైఠాయించి నిరసన చేపట్టారు. అక్కడికి వచ్చిన అధికారులతో ఆయన మాట్లాడారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
'మీకు పైనుంచి ఆదేశాలు ఏమైనా రావచ్చు. ఒత్తిళ్లు వచ్చినా మీ అధికారాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న వారిని అడ్డుకోవాలి. మీరు ఏం చేసినా ఇక రెండేళ్లే. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇప్పుడు జరిగిన అన్ని ఘటనలపై విచారణ చేయిస్తాం. నేను పిలుపు ఇచ్చి ఉంటే ఈ ఎన్నికలు ఆగపోయేవి. ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే నేను అలా చేయలేదు. మాజీ సీఎం నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా? మా ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం' అని జగన్ అన్నారు.
పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద వైఎస్ జగన్ నిరసన.. వైసీపీ ఏజెంట్లతో కలిసి వైఎస్ జగన్ బైఠాయింపు ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి వెళ్లిన మాజీ సీఎం జగన్ https://t.co/EUrEYHh4hh
— Telugu Feed (@Telugufeedsite) November 1, 2026

