1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-03-2025 Daily Astrology

17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగు వేయండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. నిస్తేజానికి లోనవుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బెట్టింగ్ జోలికిపోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం శూన్యం. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోర్ముఖులను చేస్తాయి. ధైర్యంగా ఆరుగు ముందుకు వస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. అందరితోను మితంగా సంభాషించండి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. రుణవిముక్తులవుతారు. కొత్త ఆలోచనలు స్మరిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం సంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ వాక్కు ఫరిస్తుంది. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. లావాదేవీలు మీ సమక్షంలో జరుగుతాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సకాలంలో అనుకున్న ధనం చేతికి అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కొత్త పనులు చేపడతారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనను ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఎవరిని నొప్పించవద్దు. మీ పొరపాట్లు సరిదిద్దుకోండి. దంపతుల మధ్య స్వల్ప కలహం, ఆత్మీయులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బాధ్యతలను స్వయంగా చూసుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతుంది. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఖర్చులు సామాన్యం. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆశావహదృక్పధంతో శ్రమించండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. కొంత మొత్తం ధనం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న కార్యం సఫలమవుతుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్వరామంగా శ్రమిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. రోజువారి ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
తర్వాతి కథనం
18న శ్రీవారి ఆర్జిత సేవా - 24న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్