Astrology Weekly Horoscope Details

Notifications

మీనం మీనం
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి అన్ని విధాలా కలిసివచ్చే సమయం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు, కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. శనివారం నాడు అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. గృహమార్పు అనివార్యం. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. ఆప్తులతో తరచు సంభాషిస్తుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.

అక్టోబర్ 10వ తేదీన 38 రైళ్లను రద్దు చేసిన రైల్వే

అక్టోబర్ 10వ తేదీన 38 రైళ్లను రద్దు చేసిన రైల్వేఇతర రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్ల నుండి బయలుదేరి, అక్టోబర్ 10వ తేదీన ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవలసిన సుమారు 38 రైళ్లను రద్దు చేసినట్లు, అయితే ఢిల్లీలోని ఇతర స్టేషన్లలో రైలు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర రైల్వే శుక్రవారం స్పష్టం చేసింది. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో తమ ప్రయాణాన్ని ముగించే మొత్తం 165 రైళ్లు ఉన్నాయి. అక్టోబర్ 10న ఈ స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన రోడ్డు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, వీటన్నింటిలో కేవలం 38 రైళ్లను మాత్రమే రద్దు చేశామని ఉత్తర రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?మహాలయ అమావాస్య వ్రతానికి వంట చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా దినుసులు వంటి వాటిని పూర్తిగా నివారించాలి. క్యాబేజీ, ముల్లంగి, ఆకుకూరలు వంటి కూరగాయలను అమావాస్య వంటలో కలపకూడదు. మహాలయ అమావాస్య రోజున, కోడిగుడ్డుతో సహా మాంసాహారం తినడం గానీ, మద్యం సేవించడం గానీ లేదా ధూమపానం చేయడం గానీ చాలా పెద్ద పితృ దోషాన్ని కలిగిస్తుంది. ఉదయం పూర్వీకులకు తర్పణం ఇచ్చి, కాకికి అన్నం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు భోజనం చేయాలి. అంతకు ముందు తినకూడదు. అమావాస్య రోజున ఉదయం వేళ గడపలో ముగ్గు వేయకూడదు. పసుపు కలిపిన నీటిని కూడా గడపలో చల్లకూడదు. ఉదయం పితృదేవతలకు తర్పణం ఇచ్చే వరకు పూజా గదిలో దీపం వెలిగించి పూజ చేయకూడదు.

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్నవరాత్రి అనేది దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే ముగ్గురు అమ్మవార్లను ఇంటికి ఆహ్వానించి, పూజించి, వారి అనుగ్రహాన్ని పొందే సమయం. అందువల్ల కలశం ఏర్పాటు చేసి, ఇంట్లో అమ్మవారిని కొలువుదీర్చే ముందు ఇంట్లో ఉన్న వాస్తు దోషం, ప్రతికూల శక్తులను తొలగించి, దైవ శక్తిని అడ్డుకునే వస్తువులను బయటకు పంపించాలని చెప్పబడుతుంది. నవరాత్రికి ముందు బయటకు తొలగించాల్సిన ఏడు వస్తువులు: విరిగిన విగ్రహాలు-విరిగిన, పగుళ్లు వచ్చిన లేదా రంగు వెలిసిపోయి పాడైన దేవుడి విగ్రహాలు, ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించగలవు. దీని వల్ల మానసిక ఒత్తిడి, గందరగోళాలు పెరుగుతాయి. అందువల్ల వీటిని గౌరవంగా ప్రవహించే నీటిలో తీసుకెళ్లి నిమజ్జనం చేయవచ్చు. లేదా తులసి మొక్క కింద పాతిపెట్టవచ్చు.