Astrology Weekly Horoscope Details

Notifications

మేషం మేషం
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అందరితోనూ మితంగా మాట్లాడండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బుధవారం నాడు ఒక సంఘటన ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. పంచాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.

పోలీసులపై తిరగబడిన రాప్తాడు దాడి నిందితుడు... కాల్పుల్లో మృతి?

ఆశ్రయం లేని 5,000 మంది కోసం నీతా ముఖేష్ అంబానీ అనంత ఆశ్రయ్ ప్రాజెక్టుకు నీతా అంబానీ భూమిపూజ

హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభించిన మివి

హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభించిన మివిఈ కేంద్రం మివి యొక్క తయారీ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తరిస్తున్న క్రమంలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్న మివి నిబద్ధతకు ఈ పెట్టుబడి ప్రతిబింబంగా నిలుస్తోంది. భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాలకు తోడ్పడాలని సంస్థ భావిస్తోంది. దేశ ఎలక్ట్రానిక్స్‌ తయారీ వ్యవస్థ అభివృద్ధికి సహకరించడంతో పాటు భారతీయ వినియోగదారుల కోసం మరిన్ని ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం.

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుందిమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. సంతానానికి శుభయోగం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి.

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం అన్ని రంగాల వారికీ యోగదాయకం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. తెగిపోయిన సంబంధాలు పునఃప్రారంభమవుతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.