1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-03-2025 Daily Astrology

18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది

daily horoscope
daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షా సమయం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఏ విషయానికీ నిరుత్సాహపడవద్దు. చేబదుళ్లు స్వీకరిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో మెలగండి. కొత్త పరిచయాలేర్పడతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యం కావు, మరోసారి యత్నించండి. నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చేపట్టిన కార్యం విజయవంతమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం, పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. కీలక పత్రాలు అందుతాయి. దూరప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. కార్యం సిద్ధిస్తుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి, చేపట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. బంధుమిత్రులతో విభేధిస్తారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయండి. సాహసకృత్యాలకు పాల్పడవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యం నెరవేరుతుంది. దుబారా ఖర్చులు విపరీతం, పనులు ఒక పట్టాన పూర్తికావు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాల కోసం ఎదురుచూడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. మితంగా సంభాషించండి. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
About Writer
రామన్
తర్వాతి కథనం
Chaitra Navaratri: శ్రీరామ నవమితో ముగిసే చైత్ర నవరాత్రులు.. ఉగాది ప్రత్యేకత