Astrology Weekly Horoscope Details

Notifications

సింహం సింహం
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ వారం అన్ని విధాలా అనుకూలదాయకం. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేయగలుగుతారు. ధనసహాయం చేయడం తగదు. మీ ఇబ్బందులను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలమవుతాయి. మధ్యవర్తిత్వాలు, హామీల జోలికి పోవద్దు. కొన్ని విషయాలను చూసీచూడనట్లు వదిలేయండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. అధికారులకు స్థానచలనం, ఉద్యోగస్తులకు పనిభారం.

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?మహాలయ అమావాస్య వ్రతానికి వంట చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా దినుసులు వంటి వాటిని పూర్తిగా నివారించాలి. క్యాబేజీ, ముల్లంగి, ఆకుకూరలు వంటి కూరగాయలను అమావాస్య వంటలో కలపకూడదు. మహాలయ అమావాస్య రోజున, కోడిగుడ్డుతో సహా మాంసాహారం తినడం గానీ, మద్యం సేవించడం గానీ లేదా ధూమపానం చేయడం గానీ చాలా పెద్ద పితృ దోషాన్ని కలిగిస్తుంది. ఉదయం పూర్వీకులకు తర్పణం ఇచ్చి, కాకికి అన్నం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు భోజనం చేయాలి. అంతకు ముందు తినకూడదు. అమావాస్య రోజున ఉదయం వేళ గడపలో ముగ్గు వేయకూడదు. పసుపు కలిపిన నీటిని కూడా గడపలో చల్లకూడదు. ఉదయం పితృదేవతలకు తర్పణం ఇచ్చే వరకు పూజా గదిలో దీపం వెలిగించి పూజ చేయకూడదు.

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్నవరాత్రి అనేది దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే ముగ్గురు అమ్మవార్లను ఇంటికి ఆహ్వానించి, పూజించి, వారి అనుగ్రహాన్ని పొందే సమయం. అందువల్ల కలశం ఏర్పాటు చేసి, ఇంట్లో అమ్మవారిని కొలువుదీర్చే ముందు ఇంట్లో ఉన్న వాస్తు దోషం, ప్రతికూల శక్తులను తొలగించి, దైవ శక్తిని అడ్డుకునే వస్తువులను బయటకు పంపించాలని చెప్పబడుతుంది. నవరాత్రికి ముందు బయటకు తొలగించాల్సిన ఏడు వస్తువులు: విరిగిన విగ్రహాలు-విరిగిన, పగుళ్లు వచ్చిన లేదా రంగు వెలిసిపోయి పాడైన దేవుడి విగ్రహాలు, ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించగలవు. దీని వల్ల మానసిక ఒత్తిడి, గందరగోళాలు పెరుగుతాయి. అందువల్ల వీటిని గౌరవంగా ప్రవహించే నీటిలో తీసుకెళ్లి నిమజ్జనం చేయవచ్చు. లేదా తులసి మొక్క కింద పాతిపెట్టవచ్చు.