పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?
Betel Leaf Garland
అదీ బుధవారం పూట హనుమంతునికి, గణపతికి సమర్పించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో గందరగోళాలు, గొడవలు తగ్గాలంటే.. హనుమంతుడిని పూజ చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.
ఇంకా మానసిక ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. 11 తమలపాకులను మాలగా కట్టి స్వామికి వేయాలి. ఇంట్లో ధన ప్రవాహం పెరగాలి, ధన కష్టాలు తీరాలి, వివాహ అడ్డంకులు తొలగాలి, ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు జరగాలంటే 21 తమలపాకులను, వక్కతో కలిపి మాలను కట్టి ఆంజనేయుడికి వేయాలి. దీనిని ఆంజనేయుడికి, గురు భగవానుడికి ప్రీతికరమైన గురువారం లేదా శనివారం రోజున వేయడం చాలా విశేషమైనది.

