కన్య
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది.