సంబంధిత వార్తలు
- 18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది
- 17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం
- 16-03-2026 మీ రాశి ఫలితాలు, అవకాశం చేజారినా మంచికే...
- 15-03-2026 ఆదివారం దినఫలాలు : స్థిరాస్తి ధనం అందుతుంది.. ఖర్చులు అధికం...
- 14-03-2026 శనివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన పూర్తికావు....
19-03-2016 గురువారం ఫలితాలు - అన్నింటా మీదే పైచేయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
చేపట్టిన కార్యం సఫలమవుతుంది. స్థిరచరాస్తి ధనం అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఉల్లాసంగా గడుపుతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్న కార్యం సాధిస్తారు. అన్నింటా మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. దుబారా ఖర్చులు విపరీతం.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మొక్కుబడులను మొండిగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం, పనులు సాగుకూలతకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్ఫథంతో యత్నాలు సాగించండి. అవకాశాలను అందిపుచ్చుకోండి. నిరుత్సాహపడవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. సావకాశంగా పూర్తిచేస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. పిల్లలపై దృష్టిసారించండి. ఊహించని సంఘటన ఎదురవుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ముఖ్యలను స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
ధనుస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. మొక్కులు తీర్చుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. చిన్నవాటి పరిచయస్తులు తారసపడతారు. కీలక పత్రాలు అందుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
కలుపుగోలుగా మెలుగుతారు. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాల్లో మెలకువ వహించండి. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు పురమాయించవద్దు. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
