Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్
Adi Sai Kumar as Ego Raja
ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక ఆది లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా, అగ్రెస్సివ్‌గా ఉంది. చేతిలో సిగరెట్ పెట్టుకున్న తీరు, ఆది కాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ప్రామిసింగ్‌గా ఉన్నాయి.
కె. ఎస్. రవికుమార్ వద్ద పనిచేసిన దర్శకుడు గురు శరవణన్ కూగల్ కుట్టప్పతో మంచి విజయాన్ని అందుకున్నారు. తన మూడో చిత్రమైన ఈగో రాజాతో శరవణన్ హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
శంబాల లాంటి బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న ఆది సాయి కుమార్ ఈ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. కంజూరింగ్ కన్నప్పన్, సట్టం ఎన్ కైయిల్ ఫేమ్ సతీష్ ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నారు.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం, దురైరాజ్ ఆర్ట్ మేనేజ్‌మెంట్‌తో, అద్భుతమైన సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.
