వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. లక్ష్యానికి చేరువవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. శనివారం నాడు ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు అనుకూలం. ఉద్యోగులకు బాధ్యతల నుంచి విముక్తి.