మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది. కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అధికారులకు హోదామార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు.