ధనస్సు
ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం ఏమంత అనుకూలం కాదు. కష్టం అధికం, ఫలితం స్వల్పం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అవసరాలకు అతికష్టం మీద ధనం సర్దుబాటవుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల అప్రమత్తంగా ఉండండి.